ప్రభన్యూస్ : ప్రభుత్వ అధికారుల అవినీతి పర్వం కొనసాగుతూనే ఉంది. రోజూ ఏదో ఓ చోట అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాలో ఓ అవినీతి అధికారి లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు. సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల ఇంచార్జ్ గా పని చేస్తున్న హైండ్లుమ్స్ అండ్ టెక్స్ టైల్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కే వెంకటరమణ, ఆర్మూర్ కు చెందిన వ్యక్తి నుంచి 20 వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెండ్ పట్టుపడ్డాడు. వివరాలను ఏసీపీ డిఎస్పీ ఆనంద్ వెల్లడించారు. వీవర్స్ సొసైటీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఇన్సెంటివ్ లు ఇవ్వడానికి ఆర్ముర్ లో ఓ సొసైటీ నుంచి 30 వేలు డిమాండ్ చేశాడని చెప్పారు.. 10 వేలు ఇతరత్రా ఖర్చు కాగా, 20 వేళకు డీల్ కుదిరిందన్నారు.
ఈ విషయమై ఆర్ముర్ హైండ్లుమ్స్ అండ్ టెక్స్ టైల్స్ అధ్యక్షుడు రామకృష్ణ పిర్యాదు చేయగా.. ఈ రోజు సిద్దిపేటలో తన కార్యాలయంలో దాడి చేసి రెడ్హ్యాండెండ్ పట్టుకున్నట్లు చెప్పారు. వెంకటరమణ ను అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా బాధితులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని డిఎస్పీ ఆనంద్ సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..