Thursday, November 21, 2024

Offer – ఆ గ్యాంగ్‌స్ట‌ర్‌ని లేపేయండి! 1,11,11,111 రివార్డు ఇస్తాం

బిష్ణోయ్‌ని ఎన్‌కౌంట‌ర్ చేయాలి
పోలీసుల‌కు ఆఫర్ ఇచ్చిన క‌ర్ణిసేన చీఫ్‌
భారీ రివార్డ్ ప్రకటించిన రాజ్​ షెకావత్​
వారి కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడి
వీడియో రిలీజ్​ చేసిన క‌ర్ణిసేన జాతీయ అధ్య‌క్షుడు​
సోషల్​ మీడియాలో వైరల్‌గా మారిన‌ కామెంట్స్‌

ఆంధ్రప్రభ స్మార్ట్​, ముంబయి:
గ్యాంగ్‌స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్‌ని చంపేసిన వారికి కోటి రూపాయ‌ల రివార్డు ఇస్తామ‌ని క‌ర్ణిసేన ప్ర‌క‌టించింది. క్షత్రియ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసినందుకు కోటి రూపాయలకు పైగా రివార్డు అందిస్తామ‌ని తెలిపాడు. ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు ₹1,11,11,111 రివార్డు ఇస్తామని చెప్పారు. సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య లారెన్స్ బిష్ణోయ్ ద్వారా జరిగిందని ఆ వీడియోలో తెలిపారు. అలాగే మనకు, దేశప్రజలకు భయం లేని భారతదేశం కావాలి, భయంకరమైనది కాదని వెల్లడించారు.

- Advertisement -

వారి కుటుంబం పూర్తి బాధ్యతా మాదే..

గోగమేడి హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గోల్డీ బ్రార్ బాధ్యత వహించాడు. గోగమేడిని రెండు మూడు సార్లు హెచ్చరించినా వినలేదని అన్నారు. అందుకే కాల్చానని తెలిపాడు. ఇకపోతే, క్షత్రియ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ ఓ వీడియోను విడుదల చేసి ఎన్‌కౌంటర్‌కు రివార్డు ప్రకటించారు. ఈ వీడియోలో లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసు సిబ్బందికి ₹1,11,11,111 (కోటి పదకొండు లక్షల పదకొండు వేల పదకొండు వందల పదకొండు) ఇస్తానని రాజ్ షెకావత్ పేర్కొన్నాడు. మన క్షత్రియ కర్ణి అమూల్యమైన రత్నం, వారసత్వ అమరవీరుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని చంపినా వారిని కారకులైన వారిని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసుకు సేన ఈ మొత్తాన్ని అందజేస్తుందని తెలిపారు. అలాగే ఆ ధైర్యవంతుడైన పోలీసు కుటుంబానికి భద్రత, పూర్తి ఏర్పాట్లకు కూడా మేము బాధ్యత వహిస్తామని చెప్పుకొచ్చారు.

సిద్ధిఖీ మర్డర్​ తర్వాత మారిన పరిస్థితులు..

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ చాలా కాలంగా గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడు. దసరా రోజున ముంబయిలోని బాంద్రాలో బాబా సిద్ధిఖీ హత్యకు గురయ్యాడు. మరుసటి రోజు, ఫేస్‌బుక్ పోస్ట్‌లో లారెన్స్ గ్యాంగ్ హత్యకు బాధ్యత వహించింది. ముంబయి క్రైం బ్రాంచ్‌కు చెందిన 15 బృందాలు ఈ హత్యను విచారిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో ఇద్దరు షూటర్లు సహా మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. బాబా సిద్ధిఖీ హత్య తర్వాత నటుడు సల్మాన్ ఖాన్ భద్రతను కట్టుదిట్టం చేశారు. ముంబయి పోలీసుల ట్రాఫిక్ వాట్సాప్ గ్రూప్‌లో సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు కూడా వచ్చాయి. వీటన్నింటి మధ్య క్షత్రియ కర్ణి సేన ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్‌పై ఫ్రంట్ ప్రారంభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement