Friday, November 22, 2024

13 నుంచి హాకీ ప్రపంచకప్‌ పోటీలు.. ఆతిథ్యం ఇస్తున్న ఒడిశా

2023 పురుషుల ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రపంచకప్‌కు ఒడిశా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం, రూర్కెలాలోని బిర్సా ముండా ఇంటర్నేషనల్‌ హాకీ స్టేడియం ఈ మ్యాచ్‌లకు వేదికగా నిలవనున్నాయి. జనవరి 13 నుంచి 29 వరకు పోటీలు జరుగుతాయి. ఈ పోటీలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో , ప్రముఖ సౌండ్‌ ఆర్టిస్ట్‌ సుదర్శన్‌ పట్నాయక్‌ ప్రపంచంలోనే అతి పెద్ద హాకీ స్టిక్‌ను రూపొందించారు. కటక్‌లోని మహానది తీరంలో తీర్చిదిద్దిన ఈ హాకీ స్టిక్‌.. ప్రపంచంలోనే అతి పెద్దదని సుదర్శన్‌ పట్నాయక్‌ తెలిపారు.

ఇది 105 అడుగుల పొడవు ఉందని, దీని తయారీకి 5,000 హాకీ బాల్స్‌, ఐదు టన్నుల ఇసుక ఉపయోగించినట్లు తెలిపారు. ఇది 105 అడుగుల పొడవు ఉందని, దీని తయారీకి 5,000 హాకీ బాల్స్‌, ఐదు టన్నుల ఇసుకను ఉపయోగించినట్లు చెప్పారు. 15 మంది విద్యార్థుల సాయంతో రెండు రోజుల్లో దీన్ని రూపొందించినట్లు చెప్పారు. ఈ అతిపెద్ద హాకీ స్టిక్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement