Wednesday, November 20, 2024

ఒడిశా మాజీ ముఖ్య‌మంత్రి గిరిధ‌ర్ గ‌మాంగ్ బిజెపికి రాజీనామా – బి ఆర్ ఎస్ పార్టీ వైపు చూపు

భువ‌నేశ్వ‌ర్ : ఒడిశా రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి గిరిధ‌ర్ గ‌మాంగ్ బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాకు గిరిధ‌ర్ పంపారు. కాగా ఇటీవ‌ల హైద‌రాబాద్ వ‌చ్చిన గిరిధ‌ర్ గ‌మాంగ్ బిఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు , తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ ను క‌లిశారు.. అప్ప‌డు ఆయ‌న ఒడిశా లో బి ఆర్ ఎస్ పార్టీ ఏర్పాటు చేయ‌నున్న‌న‌ట్లు త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పారు. తాజాగా ఆయ‌న బిజెపిలోని అన్నిప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు.

కాగా, గిరిధ‌ర్ గమాంగ్ రాజ‌కీయ జీవితం ప‌రిణామ క్ర‌మాన్నిప‌రిశీలించిన‌ట్లుయితే కాంగ్రెస్ పార్టీతో రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంబించి సొంతరాష్ట్రం నుంచి 9 పర్యాయాలు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1972 నుంచి 2004 దాకా వరుసగా కోరాపుట్‌, లక్ష్మీపూర్‌ స్థానాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్‌ 6 వరకు సుమారు 10 నెలలపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2015 వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీలో కీల‌క‌నేత‌గా ఉన్నాయ‌న ఆ త‌ర్వాత‌ భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు. అలాగే ఆయ‌న కుమారుడు శిశిర్ గ‌మాంగ్ కూడా బీజేపీకి రాజీనామా చేశారు. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రూ బీఆర్ఎస్ పార్టీలో చేర‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement