అంతర్జాతీ క్రికెట్ గురించి సచిన్ టెండుల్కర్ విలువైన సూచనలు చేశారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో టెస్టు ఫార్మాట్‌ది ప్రత్యేక స్థానమని చెప్పారు. టెస్టుల తర్వాత వన్డేలకు అశేష ప్రేక్షకాదరణ ఉందని, అయితే టీ20ల దూకుడుకో వన్డే ఫార్మాట్ క్రమంగా మసకబారుతోందని వ్యాఖ్యానించారు. వన్డే ప్రపంచకప్ వంటిమెగా టోర్నీలు మినహా ద్వైపాక్షిక సిరీస్‌లలో ఈ ఫార్మాట్ మ్యాచ్‌లకు చోటుదక్కడం కూడా కష్టతరం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో వన్డేలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఐసీసీ, ఆయా దేశాల క్రికెట్ బోర్డులపై ఉంది. ఈ ఫార్మాట్ ఒకరకంగా బోరింగ్‌గా మారింది. .
దీనిపై అభిమానుల్లో ఆసక్తి పెరగాలంటే కచ్చితంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సచిన్ అభిప్రాయం వ్యక్తంచేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌ను 40 ఓవర్లకు కుదించాలన్న రవిశాస్త్రి సూచనను టెండుల్కర్ స్వాగతించాడు. గత కొన్నేళ్లుగా ఈ ఫార్మాట్ మూస పద్ధతిలో కొనసాగుతోంది. ఎలాంటి మార్పులు రాలేదు. నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. రెండు బంతుల విధానం బ్యాటర్లకు అనుకూలంగా మారింది.
రివర్స్ స్వింగ్ చేసే అవకాశం బౌలర్లకు దొరకడం లేదు. దాంతో 15వ ఓవర్‌నుంచి 40వ ఓవర్ వరకు మ్యాచ్ బోరింగ్‌గా సాగుతున్నది. అందుకే టెస్టు తరహాలో 50 ఓవర్ల క్రికెట్‌ను రెండు ఇన్నింగ్స్‌లుగా విడదీసి ఆడించాలి. ఇది మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చుతుంది. దానికితోడు వాణిజ్యపరంగానూ కలిసొస్తుంది. టాస్, మంచు ప్రభావం, పిచ్ పరిస్థితులు రెండు జట్లకు అనుకూలంగా ఉండేలా చూడాలి అని సచిన్ సూచించాడు.