Tuesday, November 26, 2024

మొజంజాహి మార్కెట్‌లో ఫుట్‌పాత్‌, రోడ్లు ఆక్రమణ.. యథేచ్ఛగా సాగుతున్న పండ్ల వ్యాపారం

గోషామహల్‌, ప్రభన్యూస్ : మొజంజాహి మార్కెట్‌లో ఫుట్‌పాత్‌, రోడ్లను పండ్ల వ్యాపారులు యథేచ్ఛగా రోడ్లను ఆక్రమించుకుని అమ్మకాలు సాగించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వాహన చోదకులు, పాదచారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుత్లిబౌలి నుండి మోజాంజాహి మార్కెట్‌ వరకు నిరంతరం రద్దీగా ఈ రోడ్డులో రెండు వైపులా రోడ్లను ఆక్రమిం చుకొని పండ్ల వ్యాపారులు అమ్మకాలు సాగించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడుతుందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఈ విషయమై పలు సార్లు ట్రాఫిక్‌ పోలీసుల దృష్టిలో పడినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే కాకుండా పండ్ల వ్యాపారులు వాహన చోదకులు, పాదచారులపై కూడా దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారని వారు తెలిపారు. కొందరికి దుకాణాలు ఉన్నా గాని ఫుట్‌ పాతులతోపాటు రోడ్లను ఆక్రమించి వ్యాపారాలను చేస్తున్నారని ఈ విషయమై ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ ఈ ప్రాంతాలను అకస్మాత్తుగా తనిఖీ చేస్తే నిజనిజాలు బయటపడతాయని తెలిపారు. ఫుట్‌ పాత్‌, రోడ్లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్న పండ్ల వ్యాపారులపై హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ సర్కిల్‌ 14, ట్రాఫిక్‌ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement