బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య ఇవాళ ఐసీసీ వరల్డ్ కప్ 41వ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక జట్టు ముందుగా బ్యాటింగ్ చేపట్టింది.
అయితే శ్రీలంక బ్యాటర్లు ఆశించినంత మేరకు స్కోర్ చేయలేకపోయారు. శ్రీలంక బ్యాట్స్ మెన్లు కుశల్ పెరీరా 51 పరుగులు చేయగా, ధనుంజయ డిసిల్వ 19 పరుగులు, ఏంజెలో మాథ్యూస్ 16 పరుగులు, మహేష్ థీక్షణ 39 పరుగులు చేశారు. దీంతో న్యూజిలాండ్ జట్టు సునాయాసంగా విజయం సాధించే అవకాశముంది. శ్రీలంక జట్టు 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 172 పరుగులు చేయాల్సి ఉంది.