Friday, November 22, 2024

నర్సుపై దారుణం.. కారులో తీసుకెళ్లి, మద్యం తాగించి మరీ సామూహికంగా ఆ పని!

ముగ్గురు దోస్తులు కలిసి ఓ 21 ఏళ్ల యువతిపై గ్యాంగ్​ రేప్​కి పాల్పడ్డారు. ఈ ఘటన జూన్ 25 రాత్రి చెన్నై సమీపంలోని వెల్లూరులో జరిగింది. కాగా, ఈ కేసులో జిల్లా పోలీసులు ప్రధాన నిందితుడు శరవణన్ (29), అతని ఇద్దరు స్నేహితులు టి. సారథి,  ఎస్. సూర్య ప్రకాష్‌ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్​ ప్రకారం.. 21 ఏళ్ల యువతి నర్సుగా పనిచేస్తోంది. చెన్నై సమీపంలోని వేలూరులో మరో చోట జాబ్​ కోసం ఇంటర్వ్యూ ఉండగా తన స్నేహితురాళ్లతో కలిసి వెళ్లింది.

అయితే.. ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం వేలూరుకు వచ్చింది ఆ యువతి. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆమె వెల్లూరు బస్టాప్‌లో వేచి ఉండగా తనకు అంతకుముందే పరిచయం ఉన్న శరవణన్ వచ్చి ఆమెను భోజనానికి ఆహ్వానించాడు. దీంతో తన స్నేహితురాళ్లకు వెళ్లిపోవాలని సూచించింది. ఈలోగా శరవణన్ తన స్నేహితులైన బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి టి. సారథి (21), చెంగల్‌పట్టులోని మేజిస్ట్రేట్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది ఎస్. సూర్య ప్రకాష్ (22) కు ఫోన్ చేశాడు.

వీరు ముగ్గురు ఆ యువతిని బస్టాండ్‌కు 10 కిలోమీటర్ల దూరంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. మార్గమధ్యలో ఆ యువతికి బలవంతంగా మద్యం తాగించారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని కేసు విచారణ జరిపిన పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కూడా నిందితులు ఆమెను కారులో తీసుకెళ్తుంటే.. వారి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. అక్కడి నుంచి ఎలాగోలా ఇంటికి చేరుకుంది. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు విషయాన్ని తెలుసుకుని జూన్ 25న చెంగల్పట్టు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐపీసీ సెక్షన్ 363 (కిడ్నాప్), 323 (గాయపర్చడం) వంటి కేసులు నమోదు చేశారు. 376 (రేప్), 506 (i) (నేరపూరిత బెదిరింపు) మహిళా వేధింపుల చట్టంలోని సెక్షన్ 4 వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను జైలుకు పంపారు.. కాగా, ఈ మూడు నెలల్లో మెడికల్​ ఫీల్డ్​కు చెందిన ఇద్దరిపై ఇట్లాంటి ఘటనలు జరగడంతో వెల్లూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. వెల్లూరు జిల్లా పోలీసులు నగరంలో పెట్రోలింగ్‌ను పెంచేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఈ ఏడాది మార్చి 16వ తదే తెల్లవారుజామున వేలూరులోని ఓ ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రిలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన ఓ మహిళా డాక్టర్‌పై ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత నర్సుపై సామూహిక అత్యాచారం జరగడం ఈ జిల్లాలో రెండో కేసుగా మారింది. ఇది తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement