Friday, November 22, 2024

కేసీఆర్ చేతిలోకి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్?

హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లీజును రద్దు చేయాలని కోరుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చెందిన తెలంగాణ ప్రాంత ఉద్యోగులు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. లీజు ప్రాతిపదికన ప్రభుత్వం నుంచి తీసుకున్న ఈ భవన్‌లో లీజు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, ఏకంగా కాల్‌ సెంటర్లకు భవన్‌లోని కొంత భాగాన్ని అద్దెకు ఇచ్చారని, వెంటనే పరిశీలించి లీజును రద్దు చేయాలని లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు. ‘తెలంగాణ ఆత్మగౌరవ లేఖ’పేరిట టీడీపీ రాష్ట్ర కార్యాలయం లెటర్‌ప్యాడ్‌పై బుధవారం ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది,

తాము చాలాకాలంగా పనిచేస్తున్నా తమకు PF, ఇన్సూరెన్స్ సౌకర్యాలు లేవని, ఉద్యోగులుగా గుర్తింపు కార్డులు కూడా లేవని వివరించినట్లు తెలుస్తోంది. రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకున్నఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌ను ఇప్పుడు పరిస్థితులు బాగాలేక పోవడంతో ఆర్థిక వనరుగా, వ్యాపార కేంద్రంగా ఉపయోగించుకుంటున్నారు. భవన్‌లోని పలు విభాగాలను చంద్రబాబు సిబ్బందికి వసతి గదులుగా వినియోగిస్తున్నారు. ప్రైవేట్‌ హోటల్, క్యాంటీన్‌ నడుస్తున్నాయి. ప్రైవేట్‌ కాల్‌సెంటర్‌కు అద్దెకు ఇచ్చారు. ట్రస్టు పేరుతో లీజుకు తీసుకున్న స్థలంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకూడదు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ట్రస్ట్‌ భవన్‌ లీజును రద్దు చేసి మాకు ఆ కార్యాలయంలోనే మెరుగైన వేతనాలతో పనిచేసే అవకాశం కల్పించాలని తెలంగాణ ఉద్యోగులు సీఎంకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం లీజు రద్దు చేస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కేసీఆర్ చేతిలోకి వచ్చే అవకాశముంది.

ఇది కూడా చదవండి: సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement