ఎన్టీఆర్ తన కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రలో రౌద్రం రణం రుధిరంలో నటించినట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే హీరోలకు విప్లవ వీరుల పాత్రలను పోషించే అవకాశం చాలా తక్కువగా వస్తుంటుంది. అలాంటి అవకాశాన్ని ఇప్పుడు ఎన్టీఆర్ సద్వినియోగం చేసుకున్నాడని.. కొమురం భీం పాత్రలో అతడు ఒదిగిపోయాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ వెర్షన్‌కు సంబంధించి డిజైన్ చేసిన ఒక యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.
కొమురం భీం ఆంగ్లేయులపై తనదైన తరహాలో పోరాట శంఖం పూరిస్తాడు. దాంతో ఒకానొక కీలకమైన సమయంలో ఆయనను 100 మంది ఆంగ్లేయ సైనికులు చుట్టుముడతారట. అప్పుడు చోటుచేసుకునే యాక్షన్ సీన్ ఒక రేంజ్‌లో ఉంటుందని అందరూ చెప్తున్నారు. మూడు వారాల పాటు ఈ యాక్షన్ సీన్ ను చిత్రీకరించారట. ఎమోషన్ తో కూడిన ఈ యాక్షన్ సీన్‌కు థియేటర్లలో విజిల్స్ వర్షం కురుస్తుందని చెబుతున్నారు. కాగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన RRR మూవీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. అక్టోబర్ 13న విడుదలవుతుందో.. లేదో దర్శకుడు రాజమౌళి పెదవి విప్పితే కానీ సినిమా వాయిదా వార్తలు ఆగేలా కనిపించడం లేదు.
ఈ వార్త కూడా చదవండి: చరణ్ కొత్త పాన్ ఇండియా సినిమా షూటింగ్‌కు ముహూర్తం ఫిక్స్