దివంగత నటుడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా వంద రూపాయల నాణెం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.. తాజాగా అధికారిక గెజిట్ జారీ చేసింది.44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ నాణెం లో 50% వెండి అలాగే 40 శాతం రాగి ఉండనుంది. అంతేకాదు ఐదు శాతం నికేల్ మరియు ఐదు శాతం లోహాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నాణేనికి ఓవైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం… మరోవైపు ఎన్టీఆర్ చిత్రం దాని కింద శ్రీ నందమూరి తారక రామారావు శత జయంతి అని హిందీ మరియు ఇంగ్లీషులో 1923-2023 అరి ముద్రిస్తారు. ఈ విషయాన్ని గెజిట్లో క్లారిటీగా వివరించింది కేంద్ర ప్రభుత్వం.దాంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement