సినిమా రంగంలోనే కాకుండా ఇటు రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ సాధించిన విజయాలను కీర్తిస్తూ జస్టిస్ ఎన్వీరమణ
తన ప్రకటనలో ప్రస్తావించారు. విభిన్న రంగాల్లో మహా నాయకుడిగా విశ్వ విఖ్యాతుడిగా నిలిచిన ఎన్టీఆర్ వందవ ఏట ప్రవేశించారని తన సందేశంలో జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని తట్టి లేపిన తరువాతే తెలుగు జాతికి విశిష్ట గుర్తింపు లభించడం ఆరంభించిందని ఆయన తెలిపారు. అఖిలాంధ్ర ప్రజానీకం ఆయనకు నీరాజనాలు పట్టి దేశ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికారని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఎన్టీఆర్ జనరంజక పాలన దేశమంతటా అనుసరణీయమైందని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్దారు. ఎన్టీఆర్ను గొప్ప ప్రజాస్వామికవాదిగా. లౌకకవాదిగా, ఆదర్శ పాలకుడిగా, పేదల పెన్నిధిగా ఆయన అభివర్ణించారు. ఎన్టీఆర్ ఆశీర్వాదాలతో రాజకీయాల్లోకి వచ్చినవారు ఇప్పుడు విభిన్న పార్టీల్లో రాణిస్తూ ఉండటం ఆయన ప్రారంభించిన కొత్త ఒరవడికి ప్రజలు వేసిన ఆమోద ముద్ర అని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎన్టీఆర్తో ఆత్మీయ అనుబంధం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన పుట్టిన రోజులు జరుపుకుంటూనే ఉంటారని జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు.
తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ పుట్టినరోజులు జరుగుతూనే ఉంటాయి – జస్టిస్ ఎన్వీరమణ
Advertisement
తాజా వార్తలు
Advertisement