Saturday, November 23, 2024

అదానీకి ఎన్‌టీపీసీ కాంట్రాక్ట్.. విదేశీ బొగ్గు సప్లయ్ చేయనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్‌..

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, దేశంలోనే అతిపెద్ద విద్యుత్‌ ఉత్పత్తిదారు ఎన్‌టీపీసీ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఎన్‌టీపీసీ నుంచి భారీ ఒప్పందాన్ని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ దక్కించుకుంది. ఒప్పందంలో భాగంగా విదేశీ బొగ్గును ఎన్‌టీ పీసీకి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సప్లయ్‌ చేయనుంది. గతేడాది విద్యుత్‌ సంక్షోభం చవిచూసిన నేపథ్యంలో అలాంటి పరిస్థితులు పునరావృత్తం రాకుండా ఎన్‌టీపీసీ అప్రమత్తమైందని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రంగ ఎన్‌టీపీసీకి రెండేళ్లపాటు ఏడాదికి 1 మిలియన్‌ టన్నుల చొప్పున బొగ్గును సప్లయ్‌ చేయనుందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు కలకత్తా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దమోదర్‌ వ్యాలీ కార్ప్‌ లిమిటెడ్‌ కూడా అదానీ నుంచి బొగ్గు సప్లయ్‌ పొందే అంశాన్ని పరిశీలిస్తోందని సమాచారం.

అయితే ఈ రిపోర్టులపై అదానీ, ఎన్‌టీపీసీ, డీవీసీ ఇంకా స్పందించలేదు. కాగా 2021 రెండో అర్ధభాగంలో విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలు తీవ్రమైన బొగ్గు కొరత సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఇంధన దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం లో విదేశీ బొగ్గు దిగుమతికి నిర్ణయించింది. భారత విద్యుత్‌ ఉత్పత్తిలో బొగ్గు వాటా 70 శాతానికిపైగా ఉంది. రానున్న సంవత్సరాల్లో బొగ్గు వినియోగం మరింత పెరుగు తుందనే అంచనాలున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ దిగుమతి థర్మల్‌ బొగ్గు వ్యాపారంలో దేశంలో అతిపెద్ద కంపెనీగా ఉంది. మరోవైపు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ గత నెలలోనే ఆస్ట్రేలియాలోని వివాదాస్పద కార్మికేల్‌ బొగ్గు గని నుంచి బొగ్గు షిప్పింగ్‌ మొదలు పెట్టింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement