Saturday, November 23, 2024

NTA | నీట్ పరీక్ష‌లో అవకతవకలు.. ఎన్టీఏ డీజీపై వేటు

నీట్ ప‌రీక్ష నిర్వ‌హ‌న‌లో జ‌రిగిన‌ అవకతవకలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీ సుబోధ్ కుమార్ సింగ్ పై వేటు పడింది. యూజీసీ నీట్‌, నెట్‌ పరీక్షల లీకేజీ ఆరోపణలపై కేంద్రం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఎండిగా ఉన్న కేరళ క్యాడర్ రిటైర్డ్ ఐఏస్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాకు అదనపు బాధ్యతలు అప్పగించింది.

యూజీసీ నీట్, నెట్ పరీక్షల లీకేజీపై ఆందోళనలతో.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలకు హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర విద్యాశాఖ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏడుగురు సభ్యులుండే ఈ కమిటీకి ఇస్రో మాజీ ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ ను అధ్యక్షుడిగా నియమించింది. సంస్కరణలు, డేటా సెక్యూరిటీ, ఎన్టీయే పనితీరు మెరుగుపరిచేందుకు సూచనలు ఇవ్వనుంది ఈ కమిటీ. 2 నెలల్లో కమిటీ తన నివేదికను కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement