పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం సీట్లు 30 కాగా, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమయ్యే మ్యాజిక్ ఫిగర్ 16 స్థానాలు. ప్రస్తుతం కౌంటింగ్ ట్రెండ్స్ చూస్తే బీజేపీ-ఎన్ఆర్‌సీ కూటమి 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 6 స్థానాల్లోనూ ముందంజలో ఉంది. ఏఎంఎంకే కూటమితో పాటు, ఇతర స్వతంత్ర అభ్యర్థులు కనీసం ఆధిక్యంలో కూడా లేరు. ఇంకా 13 స్థానాలకు చెందిన ఓట్ల లెక్కింపు షురూ కావాల్సి ఉంది. దాంతో, పుదుచ్చేరి సమరాంగణంలో విజేత ఎవరన్నదానిపై మరింత స్పష్టత రానుంది. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ కు 15 స్థానాలు దక్కగా, ఎన్‌ఆర్‌సీ 8, ఏఐఏడీఎంకే 4, డీఎంకే 2 స్థానాలు గెలిచింది. ఈ సారి ఆ సమీకరణాలు మారనున్నట్లు తాజా ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి.
పుదుచ్చేరిలో బీజేపీ కూటమి ముందంజ
By ramesh nalam
- Tags
- BHARATIYA JANATA PARTY
- breaking news telugu
- CONGRESS PARTY
- counting updates
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- Puducherry elections
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- viral news telugu
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement