Friday, November 22, 2024

Railway |ఇకపై రైలు ప్రయాణికులకు రూ.10 లక్షల బీమా: ఐఆర్‌సీటీసీ

ప్రయాణికులకు బీమా సదుపాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇండియన్‌ రైల్వే టికెట్‌ బుకింగ్‌లో కొత్తగా మార్పులు తీసుకొచ్చింది. కేవలం 35 పైసలకే లభించే బీమా సదుపాయాన్ని తప్పనిసరి చేసింది. ఐఆర్‌సీటీసీ తాజా నిర్ణయంతో వెబ్‌సైట్‌/యాప్‌లో టికెట్‌ బుక్‌ చేసుకొనే సమయంలో ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కోసం బీమా ఆప్షన్‌ పక్కనున్న టిక్‌ బాక్స్‌ను ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక నుంచి ఈ ఆప్షన్‌ను ఐఆర్‌సీటీసీ డిఫాల్ట్‌గా ఇస్తోంది. ఒకవేళ బీమా ప్రయోజనాలను వద్దనుకున్నవారు మాత్రం ఆ టిక్‌ మార్క్‌ను తీసేయచ్చు.

భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డిఎఐ) నియమాల ప్రకారం ఏ సంస్థ కూడా బీమాను డిఫాల్ట్‌గా ఇవ్వరాదు. ఐఆర్‌సీటీసీకి మాత్రం వెసులుబాటు ఇచ్చింది. ఈ బీమాను ఎంచుకుంటే ప్రయాణికుడికి రూ.10 లక్షల వరకు బీమా సదుపాయం లభిస్తుంది. రైలు ప్రమాదంలో మరణిస్తే లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడి మరే పనీ చేయలేని పరిస్థితి ఎదురైతే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు అందిస్తారు. తీవ్రంగా గాయపడి అంగ వైకల్యం ఏర్పడినప్పుడు రూ.7.5 లక్షల వరకు బీమా సొమ్ము పొందొచ్చు. క్షతగాత్రులకు వైద్యఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల వరకు అందిస్తారు. బీమా పాలసీని ఎంచుకున్న ప్రయాణికులు నామినీ వివరాలను జత చేయాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement