ప్రభన్యూస్, హైదరాబాద్
భాగ్యనగరం..విశ్వనగరం, షాన్ ఏ షహర్..సైబర్ సిటీ, హైటెక్ నగరం.. పేర్లు ఏవైనా చెప్పుకోవడానికి సూపర్‌గా ఉన్నా..వానొస్తే అభాగ్యనగరం. ఈ మాటలు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే..రాజధాని హైదరాబాద్ జిల్లా పరిస్థితి.. ఇది.. పేరుకు మాత్రమే.. రాజధాని నగరం..కలెక్టరేట్ సైతం నగరం నడిబొడ్డున ఉన్నా.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలు ఆశించిన స్థాయిలో నోచుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అయితే గ్రామీణ జిల్లాలతో పోలిస్తే.. పాలనాయంత్రాంగం సైతం నత్త నడకను తలపిస్తోంది. రాజధాని..హైదరాబాదులోనే అన్నీ..ప్రధాన కార్యాలుండటంతో..అధికారుల సైతం ఎవరికి భయపడాల్సిన పనిలేదనే ధీమాతో ఉంటారని ప్రచారం నెలకొంది.
ఇలా రోజులు గడిచిపోతుంటాయి. గ్రామీణ జిల్లాలతో పోలిస్తే..ప్రజా సమస్యల పరిష్కారం కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని గతంలోనే పలువురు విపక్ష పార్టీల సభ్యులు ఆరోపించారు. ఈ సంగతి పక్కనుంచితే గత కొన్ని రోజులుగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని సైతం అధికారులు నిర్వహించని విషయం తెలిసిందే. మూడేళ్లకు పైగా అంటే.. 2020, మార్చి 22న లాక్ డౌన్ ప్రకటన వచ్చిన అనంతరం..ప్రజావాణిని నిర్వహించని విషయం తెలిసిందే. అయితే ఈ నెల 8న ..కొవిడ్ మహమ్మారి తర్వాత..మొట్టమొదటి సారిగా ప్రజావాణి షురూ అయింది. ఇక నుంచి ప్రతి సోమవారం కార్యక్రమం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
30 ఫిర్యాదుల స్వీకరణ..
కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రజల వద్ద నుంచి దాదాపు 30 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాల్సిందిగా ..హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి సూర్యలత సంబంధిత అధికారులను ఆదేశించారు.