Friday, November 22, 2024

AIIMSలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్.. ఏఏ రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులంటే!

దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORSET)-4 ద్వారా మొత్తం 3,055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు మే 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీలు, అర్హతలు..

ఉద్యోగాల భర్తీకి రిలీజ్ అయిన నోటిఫికేషన్లో మొత్తం 3055 ఖాళీలు ఉండగా.. అందులో హైదరాబాద్ లోని బీబీ నగర్ ఎయిమ్స్ -150, ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ లో – 117, ఎయిమ్స్ బటిండా – 142, ఎయిమ్స్ భోపాల్ లో – 51, ఎయిమ్స్ భువనేశ్వర్ – 169, AIIMS బిలాస్‌పూర్ – 178, ఎయిమ్స్ దేవ్‌గఢ్- 100, ఎయిమ్స్ గోరఖ్‌పూర్ – 121, AIIMS జోధ్‌పూర్- 300, ఎయిమ్స్ కళ్యాణి- 24, ఎయిమ్స్ నాగ్‌పూర్- 87, ఎయిమ్స్ రాయ్ బరేలీ- 77, ఎయిమ్స్ న్యూఢిల్లీ- 620, ఎయిమ్స్ పాట్నా- 200, AIIMS రాయ్‌పూర్- 150, ఎయిమ్స్ రాజ్‌కోట్- 100, ఎయిమ్స్ రిషికేశ్- 289, విజయ్‌పూర్ ఎయిమ్స్‌లో 180 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

జీఎన్‌ఎం (GNM) డిప్లొమాతో పాటు రెండేళ్ల అనుభవం లేదా బీఎస్సీ ఆనర్స్‌, నర్సింగ్‌, బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్‌, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణత సాధించాలి.

- Advertisement -

వయోపరిమితి: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగులకు పదేళ్లు, మాజీ సైనికులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: రూ.9300- రూ.34800 ప్లస్ గ్రేడ్ పే రూ.4600.

దరఖాస్తు రుసుము: జనరల్/ OBC అభ్యర్థులకు రూ.3000; SC/ST/EWS అభ్యర్థులకు రూ.2400; PWD అభ్యర్థులకు మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ: డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్‌తో పాటు NORSET-4లో పొందిన స్కోర్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయబడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement