హెదరాబాద్, ఆంధ్రప్రభ : సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 177 జూనియర్ అసిస్టెంట్ ( ఎక్స్టర్నల్ క్లర్కు) పోస్టుల భర్తీ కోసం సింగరేణి యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల ప్రకటించిన ఇంటర్నర్ పోస్టులకు అదనం అని సింగరేణి డైరెక్టర్ బలరామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులకు ఈ నెల 20 నుంచి జులై 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
రాతపరీక్ష ఆధారంగానే ఉద్యోగ భర్తీ ప్రక్రియ చేపడుతామని, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానికులకు ( ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలు ) 95 శాతం, రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు 5 శాతం ఓపెన్ కోటా కింద భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారికి గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు వయో సడలింపు ఉంటుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.