Saturday, November 23, 2024

1392 జూనియర్‌ లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్‌.. ఈనెల 16నుంచి దరఖాస్తుల ప్రక్రియ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారిగా జూనియర్‌ లెక్చరర్ల భర్తీకి తెలంగాణ సర్కార్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వరుస నోటిఫికేషన్లతో నియామక ప్రక్రియను పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం శుక్రవారంనాడు 1392 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 16నుంచి దరఖాస్తుల ప్రక్రియకు నిర్ణయించింది. 2008లో ఉమ్మడి రాష్ట్రంలో 1100 జూనియర్‌ లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్‌ తర్వాత మరోసారి ఇంత పెద్ద మొత్తంలో జేఎల్‌ భర్తీ ఇదే కావడం గమనార్హం. ఈ నెల 16నుంచి జనవరి 6వరకు దరఖాస్తులను స్వీకరించేందుకు టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు.

సబ్జెక్టుల వారీగా…

అరబిక్‌ 2, బోటనీ 113, బోటనీ ఉర్దుమీడియం 15, కెమిస్ట్రీ ఉర్దూ మీడియం 19, సివిక్స్‌ మరాఠీ మీడియం 1, కామర్స్‌ 50, కామర్స్‌ ఉర్దూ మీడియం 7, ఎకనామిక్స్‌ 81, ఎకనామిక్స్‌ ఉర్దూ మీడియం 7, ఇంగ్లీష్‌ 153, ఫ్రెంచ్‌ 2, హిందీ 117, హిస్టరీ 77, హిస్టరీ ఉర్దూ 17, హిస్టరీ మరాఠీ 1, మ్యాథమెటిక్స్‌ 154, మ్యాథమెటిక్స్‌ ఉర్దూ 9, ఫిజిక్స్‌ 112, ఫిజిక్స్‌ ఉర్దూ మీడియం 18, సంస్కృతం 10, తెలుగు 60, ఉర్దూ 28, జియాలజీ 128, జియాలజీ ఉర్దూ 18 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement