ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుజల చేసింది. 2019 ఎన్నికల వేళ బీజేపీ తమ మ్యానిఫెస్టోలో సీఏఏను చేర్చింది. అప్పటి నుంచి అమలుకి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. పొరుగు దేశాల్లో అణచివేతకు గురైన మైనారిటీ వర్గాలకు పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తుంది.
పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు సీఏఏ వరంగా మారనుంది. హిందువులు, క్రైస్తవులు, సిక్కులు,బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లకు పౌరసత్వం లభిస్తుందని కేంద్రం గెజిట్లో తెలిపింది. 1995 నాటి చట్టంలో మార్పులు చేర్పులు చేసి 2019లో పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం రూపొందించింది.