దేశంలోని ప్రఖ్యాత కళాశాలల్లో పీజీ బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్-బయోటెక్నాలజీ(జీఏటీబీ)-2024’, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం నిర్వహించే ‘బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (బీఈటీ)-2024 నోటిఫికేషన్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలో సాధించిన మెరిట్ ద్వారా వివిధ ఇన్‌స్టిట్యూట్లు, యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందవచ్చు.
ప్రవేశ పరీక్షకు సంబంధించి ఫిబ్రవరి 8న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మార్చి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 20న కంప్యూటర్ ఆధారిత విధానంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జీఏటీబీ-2024, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీఈటీ-2024 పరీక్ష నిర్వహిస్తారు.
వివరాలు..
దరఖాస్తు ఫీజు:
జీఏటీ-బీ- రూ.1200(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.600)
బీఈటీ- రూ.1200(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.600
జీఏటీ-బీ, బీఈటీ(రెండూ)- రూ.2400 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.1200)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లింపు చివరితేది: 06.03.2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 08.03.2024 నుంచి 09.03.2024 వరకు.
ప్రవేశ పరీక్షల తేదీ: 20.04.2024.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష వ్యవధి: 180 నిమిషాలు.
సమయం: జీఏటీబీ-2024 – ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, బీఈటీ-2024 – మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు .