వరంగల్ ప్రభన్యూస్ ప్రతినిధి: పీజీ దంత కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 4,5వ తేదిల్లో మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈమేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ దంత కళాశాలల్లో ఎండీఎస్ ¸ ూజమాన్యకోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈనెల 4న శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 5న శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
ధృవపత్రాలు పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి ఇప్పటికే మెరిట్ జాబితాను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపిం చారు. జాబితాలో అర్హులైన అభ్యర్దులు కళాశాల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. కళాశాల వారీగా సీట్ల వివరాలను వెబ్సైట్లో చూసుకోవచ్చు అని పేర్కొన్నారు. మరింత సమాచారానికి WWW. KNRUHS. Telangana. Gov.in వెబ్సైట్లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించారు.