రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 94 పోస్టులను భర్తీ చేస్తారు. ఇదిలా ఉండగా, దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 16గా నిర్ణయించింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫేజ్-1 & ఫేజ్-2 పరీక్షలు సెప్టెంబర్, అక్టోబర్ 2024 నెలల్లో నిర్వహించనున్నారు. అర్హత గల అభ్యర్థులు RBI అధికారిక వెబ్‌సైట్ rbi.org.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత, ఇతర వివరాలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అన్ని సెమిస్టర్లు/సంవత్సరాలలో కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ / తత్సమాన టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ అర్హతను కలిగి ఉండాలి. ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు 50% ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. లేదా ఏదైనా విభాగంలో 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ / సమానమైన టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ అర్హత. ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు ఉత్తీర్ణత సాధించాలి.