హైదరాబాద్ నగరంలోని లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ఎమరాల్డ్ స్వీట్ హౌస్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వీట్స్ తయారీలో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్, కెమికల్స్ వాడుతున్నారని… పాలు, పెరుగు, పనీర్ వంటివి రోజుల తరబడి ఫ్రిజ్ లో నిల్వ ఉంచినట్లు గుర్తించారు.
ఇక సరైన లేబుల్స్ లేని ముడిసరుకుతో పాటు వంటగది ప్రాంతం అపరిశుభ్రంగా ఉందని గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా రసాయనాలు కలిపిన 60 కిలోల బెల్లం, 3 కిలోల నాసిరకం జీడిపప్పును స్వాధీనం చేసుకున్నారు.