పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్న చైనా ముెెెబైల్ కంపనీలకు నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మంగళవారం నాడు రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చైనా మొబైల్ కంపెనీలైన ఒప్పో, వివో ఇండియా, షావోమీ కంపెనీలకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. పన్ను ఎగవేత పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతుందని ఆర్ధిక మంత్రి వెల్లడించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఈ కంపెనీలకు నోటీసులు జారీ చేశాయి.
ఒప్పో కంపెనీ మొత్తం 4,389 కోట్ల మేర కస్టమ్ డ్యూటీ ఎగవేసినట్లు తేలిందని ఆర్థిక మంత్రి తెలిపారు. కొన్ని వస్తువుల విలువను తక్కవ చేసి చూపించడం ద్వారా పన్ను ఎగవేతకు ఈ కంపెనీ పాల్పడింది. దీని వల్ల కంపెనీ 2,981 కోట్లు పన్ను తక్కువగా చెల్లించిందని ఆమె వివరించారు.
దిగుమతి చేసుకున్న వాటి విలువను తక్కువ చూపించడం ద్వారా కంపెనీ 1408 కోట్లు ఎగవేతకు పాల్పడిందని చెప్పారు. మొత్తం ఎగవేత 4,389 కోట్లలో కంపెనీ స్వచ్ఛందం గా ముందుకు వచ్చి 450 కోట్లు డిపాజిట్ చేసిందన్నారు. మరో కంపెనీ షావోమి 653 కోట్లు ఎగవేతకు పాల్పడింది. ఈ కంపెనీ 46 లక్షలు మాత్రమే డిపాజిట్ చేసిందని చెప్పారు. వివో ఇండియా కంపెనీకి డిమాండ్ నోటీస్ జారీ చేశారు. ఈ కంపెనీ 2,217 కోట్లు చెల్లించాలని ఈ నోటీస్‌లో పేర్కొన్నారు. నోటీసులు జారీ చేసిన తరువాత వివో స్వచ్ఛందంగా 60 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసింది. వీటితో పాటు వివో ఏర్పాటు చేసిన మరో 18 కంపెనీల ఆర్థిక వ్యవహారాలను కూడా ఈడీ పరిశీలిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి వెల్లడించారు. ఈ కంపెనీలు కూఆ 62 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశాయి. వివో మాతృ సంస్థ మన దేశం బయట చైనాలో ఉందని, ఈ కంపెనీ మొత్తం లక్షా 25 వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిపిందని చెప్పారు. వివో ఏర్పాటు చేసిన ఈ 18 కంపెనీల ద్వారా మన దేశం నుంచి పెద్ద మొత్తంలో నిధులను మాతృదేశంలోని కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేసిందన్నారు. ఈ మొత్తం ప్రభుత్వ అంచనా ప్రకారం 62 వేల కోట్లు ఉంటందని ఆర్థిక మంత్రి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.