హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచేలా మాట్లాడినందుకు బాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి హయత్‌నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41ఏ సీఆర్‌పీసీ కింద సంజయ్‌కు నోటీసులు ఇచ్చినట్టు పోలీసులు చెప్పారు. ఇదే విషయంలో గత నాలుగు రోజుల క్రితం బాజపా నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే కేసులో ఆ పార్టీ నేతలు రాణిరుద్రమ, దరువు ఎల్లన్నలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాజపా ఆధ్వర్యంలో హైదరాబాద్ శివారు నాగోల్ బండ్లగూడలో ఏర్పాటు చేసిన అమరుల యాది కార్యక్రమంలో బండి సంజయ్‌తో పాటు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సభలో సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా ట్విట్ చేసిన రాణిరుద్రమ, ఎల్లన్నలను హయత్‌నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలపై ఆరోపణలు చేస్తూ బాజపా ఓ నాటకాన్ని ప్రదర్శించింది. కేసీఆర్ సాగిస్తున్న నిరంకుశ పాలన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించుకున్నామా అని రాష్ట్ర ప్రజలు ఆవేదన చెందుతున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ విషయాలను ప్రజలకు తెలియజెప్పేందుకే అమరవీరుల యాదలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వారు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.