రాష్ట్రంలోని 416 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా క్లినిక్ లు, ఆస్పత్రులను తనిఖీలు చేస్తున్నామన్నారు. నాలుగు రోజులుగా 1569 ఆస్పత్రులు తనిఖీ చేశామన్నారు. లైసెన్స్ లు లేని 81 ఆస్పత్రులు సీజ్ చేశామన్నారు. 64 ఆస్పత్రులకు ఫైన్లు వేశామన్నారు. రెండు వారాల్లో స్పందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.