Wednesday, November 20, 2024

ఓట్ల‌తో ప‌ని లేదు- న‌చ్చిన‌వారిని ఎలిమినేట్ చేస్తారు-బిగ్ బాస్ పై అభిన‌య‌శ్రీ షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ ఆరో సీజ‌న్ న‌డుస్తోంది. మొద‌టివారం ఎవ‌రిని ఎలిమినేట్ చేయ‌కుండా రెండ‌వ వారం ఇద్ద‌రిని ఎలిమినేట్ చేశారు.
శనివారం రోజున షానిని ఎలిమినేట్ చేయగా .. ఆదివారం రోజున అభినయశ్రీ ని ఎలిమినేట్ చేశారు. ఈ ఇద్దరి ఎలిమినేషన్లపై విమర్శలు కూడా వచ్చాయి. షానిని పంపిద్దామని అప్పటికప్పుడు డిజైన్ చేసుకున్నారని ఓట్లతో సంబంధం లేకుండా పంపించారని, సెండ్ ఆఫ్ వీడియో కూడా ప్లే చేయలేదని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ కి వారానికి ఇంత అని రెమ్యునరేషన్ ఇస్తారన్న విషయం తెలిసిందే. హౌస్ లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మరింత ఫేమవ్వడానికి వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తారు. రెండవ వారంలో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన అభినయశ్రీ షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ అంతా మోసం నాకు సంబంధించిన సెండాఫ్ వీడియోను గంట షోలో కనీసం ఐదు నిమిషాలు కూడా చూపించలేదు. ఆ షో నాకు హెల్ప్ అవ్వలేదు.. అందులో పాల్గొన్నందుకు రెమ్యునరేషన్ కూడా ఎక్కువ ఇవ్వలేదు.. అంతేకాక హౌస్ లో నాకంటే తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఉంచి.. నన్ను పంపించేశారు. నాకు చాలా అన్యాయం చేశారు అంటూ పాపోయింది. దీంతో పలువురు నెటిజన్లు కూడా ఈమెకు మద్దతు పలుకుతున్నారు. ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండా అభినయశ్రీని ఎలిమినేట్ చేసినట్లు స్పష్టమవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement