నథింగ్ ఫోన్ (1) జులై 12న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ లో సేల్స్ కు ఉందని కంపెనీ తెలిపింది. ఫస్ట్ నథింగ్ స్మార్ట్‌ఫోన్ ని కొన్నవారికి డిస్కౌంట్ కూడా వెల్లడించింది. 250 కంటే ఎక్కువ నగరాల్లోని 270కి పైగా సేవా కేంద్రాల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా నథింగ్ ఫోన్ (1) పర్చేస్ చేసే కస్టమర్లకు రూ.2000 తగ్గింపునకు అర్హులు అని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.
అంతే కాకుండా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇఎంఐ లావాదేవీలపై కూడా డిస్కౌంట్ పొందవచ్చు. నథింగ్ రాబోయే ఫోన్ (1)ని 3 RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో రానుంది – 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB ధర $397 (సుమారు రూ. 31,000), $419 (సుమారు రూ. 32,000), $456 (సుమారు రూ. 36,000). కాగా డిస్కౌంట్ తర్వాత నథింగ్ ఫోన్ (1) వేరియంట్లు రూ.29,000, రూ.30,000 మరియు రూ.34,000లకు అందుబాటులో ఉంటాయి.
నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్స్..
నథింగ్ ఫోన్ (1) 6.55-అంగుళాల OLED డిస్ప్లేను ఉండనున్నట్టు తెలుస్తోంది. 120Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778G+ చిప్సెట్ ద్వారా అందించబడుతుందని కార్ల్ పీ ధ్రువీకరించారు. కెమెరా విషయానికి వస్తే, స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, ఇది 50MP ప్రైమరీ సెన్సార్, 16MP అల్ట్రా వైడ్ సెన్సార్‌తో ఉంటుందని భావిస్తున్నారు. ముందు భాగంలో, 16MP సెల్ఫీ షూటర్ ఉండచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,500 mAh బ్యాటరీతో రానునట్టు టెక్ వర్గాల సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.