Tuesday, November 26, 2024

భారత మార్కెట్లోకి ‘నథింగ్​ ఫోన్​ 2’.. ఆన్​లైన్​ ద్వారా డిస్కౌంట్​ ఆఫర్స్​ ఇవే..

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నథింగ్ ఫోన్ 2 ఎట్టకేలకు ఇండియ‌న్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. రూ.44,999 ప్రారంభ ధరతో ఈ ఫోన్​ వస్తోంది. నథింగ్ ఫోన్ 2 పేల్స్ ఒక వారంలో (జూలై 21న) ప్రారంభం కానున్నాయి. అయితే, వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. ఈ అత్యాధునిక 5G స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా గణనీయంగా డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. కాగా, సేల్ ఈవెంట్‌కు దారితీసే లాంచ్ ఆఫర్‌లతో పాటు, తాజా నథింగ్ ఫోన్ (2) గురించి తప్పనిసరిగా తెలుసుకోవలసిన వివరాలు ఇక్కడ ఉన్నాయి.

భారత్ మార్కెట్‌లో నథింగ్ ఫోన్‌‌–2 ధర..

భారతదేశంలో నథింగ్ ఫోన్ 2 బేస్ మొడ‌ల్ ధ‌ర ధర రూ.44,999గా కంపెనీ నిర్ణ‌యించింది. అయితే సేల్ సమయంలో కస్టమర్‌లు డిస్కౌంట్ ను పొందవచ్చు. ఆన్ లైన్ ఈ కామ‌ర్స్ ప్లాట్ ఫామ్ Flipkartలో ఈ డిస్కౌంట్ ఆఫ‌ర్స్ అందుబాటులో ఉండ‌నున్నాయి. కొనుగోలు స‌మ‌యంలో Axis Bank & HDFC బ్యాంక్ కార్డ్‌లను ఉంయోగిస్తే.. రూ.44,999గా ఉన్న ఫోన్ రూ.41,999 కే ద‌క్కించుకోవ‌చ్చు. వినియోగదారులకు దాదాపు రూ.3,000 తగ్గింపు దొరుకుతుంది. ఈ డీల్ పైన పేర్కొన్న ధర బేస్ మొడ‌ల్ 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం వ‌ర్తిస్తోంది.

కాగా, 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ కి నథింగ్ ఫోన్ 2 ధర రూ.49,999గా ఉంది. అయితే బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్ పై కూడా 3000 డిస్కౌంట్ ని పొంద‌వ‌చ్చు. అంటే ఈ మొడ‌ల్ ఫోన్ రూ.46,999కి ద‌క్కించుకోవ‌చ్చు. నథింగ్ ఫోన్(2) హై ఎండ్ మోడల్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. 12GB RAM+512GB స్టోరేజీ ఉన్న మోడల్ ధర రూ.54,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్ ద్వారా ఈ మోడల్ ఫోన్‌ను రూ.51,999కి సొంతం చేసుకోవచ్చు.

- Advertisement -

నథింగ్ ఫోన్‌‌–2 స్పెసిఫికేషన్‌లు

నథింగ్ ఫోన్ 2 6.7 inches ఫుల్ HD+డిస్ ప్లేతో వస్తోంది. 1080*2,412 Pixels రిజల్యూషన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఇందులో 8GB+128GB స్టోరేజీ ఉంటుంది.

నథింగ్ ఫోన్ 2 స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCని కలిగి ఉన్న ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ చిప్‌సెట్‌తో వ‌స్తోంది. ప్రాసెసర్ Adreno 730 GPUతో రూపొందించబడింది. దీని కెమెరా బ్యాక్ సైడ్ 50MP క్వాలిటీతో వస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరాకు 32MP ఉంచారు. అంతేకాదు మూడు హై-డెఫినేషన్ మైక్రో ఫోన్లు, రెండు స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.

నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్లో 4,700mah సామర్థ్యంలో కూడిన బ్యాటరీతో వస్తుంది. ఇది 45w pps wired, 15W వైర్‌లెస్ ఛార్జింగుకు సపోర్ట్ చేస్తుంది. వైర్ ఉన్న ఛార్జింగ్ అయితే 55 నిమిషాల్లో ఫుల్ అయిపోతుంది. వైర్ లెస్ ఛార్జింగులో అయితే సుమారు 130 నిమిషాల సమయం పడుతుందని నథింగ్ ఫోన్ కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఈ ఫోన్‌కు రెండు వైపులా గొరిల్లా గ్లాస్ ఉండటం గమనార్హం.

నథింగ్ ఫోన్ 2 బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉందో తెలుసుకునేందుకు ప్రొగ్రెస్ బార్ ఫీచర్ కూడా రూపొందించారు. ఈ ఫోన్లో ఉబర్, జొమాటో వంటి థర్డ్ పార్టీ యాప్‌ల పికప్, డెలివరీల ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ప్రోగ్రెస్ బార్లను సైతం అమర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement