Friday, November 22, 2024

న‌థింగ్‌ ఇయర్ బడ్స్‌2.. రెండో ప్రొడ‌క్ట్‌ని లంచ్ చేసిన కంపెనీ

బెస్ట్ లుక్‌.. ట్రాన్స్‌ప్రంట్ డిజైన్ కేస్‌తో నథింగ్ ఇయర్ స్టిక్‌ను తీసుకొచ్చింది. భారత్‌తో పాటు ప‌లు దేశాల్లో తన మూడో ప్రొడక్టుగా ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. దీని డిజైన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. స్పెసిఫికేషన్లు కూడా ఇంట్రెస్టింగ్‌గా, ఇంప్రెస్ చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా నథింగ్ ఇయర్ స్టిక్ బడ్స్ బరువు.. చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తంగా ఇయర్‌బడ్స్ 29 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తాయ‌ని తెలుస్తోంది. నథింగ్ ఇయర్‌ స్టిక్స్ ఇయర్‌బడ్స్‌లో 12.6mm డైనమిక్ సౌండ్ డ్రైవర్స్ ఉంటాయి. వాటర్, డస్ట్ రెసిస్టెంట్స్ కోసం IP54 రేటింగ్‌తో ఈ బడ్స్ వస్తున్నాయి. ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంటుంది. అయితే యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ (ANC) ఉండదు. అలాగే సిలికాన్ బడ్స్ కూడా దీనికి ఉండవు. కాల్ క్వాలిటీ అత్యుత్తమంగా ఉండేలా హై-డెఫ్ మైక్స్‌ను ఇయర్ స్టిక్స్‌లో ఇస్తున్నట్టు నథింగ్ పేర్కొంది.

ఇతర టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌బడ్స్‌తో పోలిస్తే Nothing Ear (Stick) డిజైన్ పరంగా చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. నథింగ్ నుంచి వచ్చిన ఈ మూడో ప్రొడక్టు కూడా ట్రాన్స్‌పంట్ కేస్‌తో లుక్స్ పరంగా వెరైటీగా ఉంది. సాధారణంగా ఇయర్‌బడ్స్ కేస్‌లకు ఫ్లిప్ ఓపెనింగ్ ఉంటుంది. అయితే నథింగ్ ఇయర్‌ స్టిక్స్.. ట్విస్ట్ ఓపెనింగ్ కేస్‌తో వస్తోంది. అలాగే సిలిండ్రికల్ షేప్ కూడా చాలా కొత్త లుక్‌గా అనిపిస్తోంది. బ్యాటరీ విషయానికి వస్తే, Nothing Ear (Stick) బడ్స్.. ఫుల్ చార్జ్‌పై 7 గంటల వరకు ప్లే టైమ్‌ను ఇస్తాయి. 3 గంటల టాక్ ‌టైమ్ ఉంటుంది. చార్జింగ్ కేస్‌తో మరో మూడుసార్లు బడ్స్‌ను చార్జ్ చేసుకోవచ్చు. అంటే మొత్తంగా 29 గంటల వరకు ప్లేటైమ్, 12 గంట టాక్‌టైమ్ ఉంటుంది. ఒక్కో ఇయర్‍బడ్ 4.4 గ్రాముల బరువు ఉంది. చార్జింగ్ కోసం టైప్‌-సీ పోర్ట్‌తో ఇయర్‌స్టిక్ కేస్ వస్తోంది.

Nothing Ear (Stick) ధర, సేల్‌..

- Advertisement -

నథింగ్ ఇయర్‌ స్టిక్ ధర ఇండియాలో రూ.8,499గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు రానుంది. ముందుగా ఈనెల 28వ తేదీన పరిమిత సంఖ్యలో యూనిట్లు సేల్‌కు వస్తాయి. ఆ తర్వాత నవంబర్ 4వ తేదీన నథింగ్ ఇయర్ స్టిక్ ఓపెన్‌కు లభిస్తాయి. ప్రస్తుతం వైట్ కలర్‌లోనే ఈ ఇయర్‌బడ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత బ్లాక్ కలర్ ఆప్షన్ కూడా లభించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement