Friday, November 22, 2024

ఇంగ్లిష్‌ అర్థం కావడం లేదని.. ఒంటికి నిప్పంటించుకొని స్టూడెంట్‌ ఆత్మహత్మ

మునిపల్లి, (ప్రభన్యూస్‌) : ఇంటర్‌ మీడియట్‌ చదువుతూ ఇంగ్లీష్‌ పాఠం అర్థం రావడం లేదని.. ఒంటికి నిప్పంచుకొని ఓ స్టూడెంట్‌ మేళసంగం విలేజ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి మునిపల్లి ఎస్‌ఐ చల్లా రాజశేఖర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మేళసంగం గ్రామానికి చెందిన బేగరి సాయి నిఖిల్‌ (16)అనే స్టూడెంట్‌ మండలంలోని బుదేరా గవర్నమెంట్‌ కాలేజ్‌లో ఇంటర్‌ మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. అయితే ఇంటర్‌లో ఇంగ్లీష్‌ సబ్జెక్ట్‌ అర్థం కావడం లేదని, ఇంగ్లీష్‌లో తక్కువ మార్కులు వచ్చి తోటి స్టూడెంట్‌ల మధ్య చులకన అవుతున్నానని తన తండ్రి అయిన బేగరి రాచయ్యకు పలుమార్లు చెప్పాడు. అయితే ఈ విషయాన్ని తండ్రి రాచయ్య పట్టించుకోలేదు. దీంతో ఇంగ్లీష్‌ సబ్జెక్ట్‌ అర్థం కావడం లేదని తండ్రి పట్టించుకోకుంటే ఇంకెవరికి చెప్పుకోవాలో దిక్కుతోచక జీవితంపై విరక్తి చెందిన స్టూడెంట్‌ ఈ నెల 17న (సోమవారం) విలేజ్‌లోనే ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు.

దీంతో గమనించి చుట్టు-పక్కల వాళ్లు సాయి నిఖిల్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. సాయి నిఖిల్‌ను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు. మృతుని తండ్రి బేగరి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement