Tuesday, November 19, 2024

brutal murder: ఆగ‌ని లివ్ ఇన్ రిలేష‌న్ హ‌త్య‌లు ..మొన్న‌శ్ర‌ద్దా వాక‌ర్, నేడు నిఖిత‌…

ఇటీవల కాలంలో లివ్ ఇన్ రిలేషన్స్ పెరుగుతున్నాయి. యువతీయువకులు సహజీవనం పేరుతో కలిసి ఉంటున్నారు. గతంలో ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే యువతి హత్య సహజీవనం ఎంత ప్రమాదకరమో నిరూపించింది. ఈ ఘటన తర్వాత లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న యువతులు పలు కారణాలతో హత్యలకు గురవుతూనే ఉన్నారు.

తాజాగా మరో యువతి దారుణ హత్యకు గురైంది. తనలో శారీరక సంబంధం పెట్టుకోవడానికి, సెక్స్ చేయడానికి నిరాకరించినందుకు 20 ఏళ్ల మహిళలను ఆమె భాగస్వామి అయిన వ్యక్తి కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగింది. మరణించిన యువతిని నిఖితా ప్రజాపతిగా గుర్తించారు. యువతికి, నిందితుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్నేహితులయ్యారు, ఆ తర్వాత నగరంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డిసెంబర్ 7న రావుజీ బజార్ ప్రాంతంలో మహిళ హత్య జరిగితే.. ఆరు రోజుల తర్వాత హ‌త్య విష‌యం బ‌య‌ట ప్ర‌పంచానికి తెలిసింది..శిధిలావ‌స్థ‌లో ఉన్న ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ డీసీపీ అభినయ్ విశ్వకర్మ తెలిపారు.. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement