Thursday, November 21, 2024

ప్యాంట్ లోపల బంగారం.. గోల్డ్ స్మగ్లింగ్ లో కొత్త టెక్నిక్

బంగారం అక్రమ రవాణాలో స్మగ్లర్లు కొత్త టెక్నిక్ లు అనుసరిస్తున్నారు. ఇటీవల అమృత్ సర్ లో షార్జా నుంచి వస్తున్న వ్యక్తి తన లో దుస్తుల్లో బంగారాన్ని ముద్దలా చేసి తరలిస్తూ పట్టుబుడ్డాడు. తాజాగా కేరళలోని కన్నూరు ఎయిర్ పోర్ట్ లో అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని తరలించేందుకు కొత్త పంథా ఎంచుకున్న ఓ వ్యక్తి ప్లాన్ బెడిసికొట్టింది. బంగారాన్ని పలుచటి ముద్దలా చేసి పూత పూసిన ప్యాంట్ ధరించి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కన్నూరు విమానాశ్రయంలో సోమవారం ఫారెన్​ నుంచి ఓ విమానం ల్యాండ్​ అయ్యింది. అందులోంచి దిగిన ప్రయాణికులను అధికారులు చెక్​ చేశారు. ఈ సమయంలో ఒక వ్యక్తి ప్యాంటుపై పసుపు రంగు మరకలు ఉండటం కస్టమ్స్ అధికారుల దృష్టిని ఆకర్షించింది. సదరు ప్యాసింజర్‌ను ఆపారు. పూర్తిగా చెక్ చేస్తే.. అతని ప్యాంటుపై మరకలు పెయింట్ కాదని, అది మొత్తం బంగారమని తేలింది. అంతేకాదు సదరు ప్యాంటు రెండు పొరలతో ఉంది. బంగారాన్ని పేస్టుగా మార్చి దాని లోపల పొరలపై పైనుంచి కింది వరకూ నింపేశాడు. దానిపై రెండో పొర కప్పి, ఏమీ ఎరగనట్లు ప్యాంటు ధరించాడు. దీంతో బంగారం స్మగ్లింగ్​ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు. రూ.14 లక్షల విలువైన 302 గ్రాముల బంగారాన్ని సీజ్​ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరస్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు ఫన్ని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement