Friday, November 22, 2024

AP | పెళ్లి చేయలేదని.. తండ్రి కాళ్లు విరగొట్టిన త‌న‌యులు

కర్నూలు బ్యూరో : తమ పెళ్లిళ్లు చేయకపోగా.. తమకు వచ్చిన సంబంధాలను చెడగొడుతున్నాడన్న కోపంతో ఇద్దరు కొడుకులు, కూతురు కలిసి కన్న తండ్రి కాళ్లు విరగొట్టిన సంఘటన మండల కేంద్రమైన గోనెగండ్లలో శుక్రవారం చోటుచేసుకుంది. మంతరాజు, ఆదిలక్ష్మి అనే దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం చేయగా.. ముగ్గురికి వివాహం కావలసి ఉంది.

అయితే తమకు పెళ్లి సంబంధాలు చూడకుండా, పెళ్లి చేయకుండా తండ్రి పట్టించుకోవడం లేదని, పైగా తమకు వచ్చిన పెళ్లి సంబంధాలను తండ్రి చెడగొడుతున్నాడని కొంతకాలంగా ముగ్గురు పిల్లలు, తల్లి కలిసి వేరుగా ఉంటున్నారు. అయితే శుక్రవారం ఉదయం పెద్దమనుషులు పంచాయతీకి పిల‌వ‌డంతో తండ్రి మంతరాజు పిల్లల ఇంటి దగ్గరికి రావడంతో కోపోద్రిక్తులైన కుమారులు నీలకంఠ, జగదీష్, కుమార్తె దేవీలు తండ్రిని షాపులోకి పిలుచుకుని వెళ్లి షెట్టర్ వేసి కంట్లో కారం కొట్టి కాళ్లు విరగొట్టారు.

తీవ్రంగా గాయాలు చేశారు. అయితే బయట ఉన్న పెద్ద మనుషులు లోపల నుండి కేకలు వినపడడంతో షెట్టర్ తీసి చూడగా, తండ్రిని కొట్టి కాలు విరగొట్టడంతో వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement