అమెరికా మాజీ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా తిరిగి తెరుచుకుంది. ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్.. పోల్ నిర్వహించి ట్రంప్ ఖాతాను పునరుద్ధరించారు. ఖాతా పునరుద్ధరణపై కంపెనీ మస్క్ నిర్వహించిన ఓటింగ్‌లో 51.8 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఓటువేశారు. దీంతో మాజీ అధ్యక్షుడి ఖాతాను పునరుద్ధరిస్తున్నామని మస్క్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ట్విట్టర్‌లోకి తిరిగి వచ్చేందుకు తనకు ఆసక్తి లేదని ట్రంప్ అన్నారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ రూపొందించిన ట్రూత్ సోషల్ యాప్ అద్భుతంగా పనిచేస్తోందని.. తాను దానికే పరిమితమవుతానని చెప్పారు. నా అభిప్రాయాలను ట్రూత్ సోషల్ యాప్ ద్వారా పోస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. తనను తిరిగి ట్విట్టర్‌లోకి ఆహ్వానించినందుకు ఎలాన్ మస్క్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement