Saturday, October 5, 2024

TG | ఫోర్త్ సిటీ కాదు ఫోర్త్ బ్రదర్స్ సిటీ : కేటీఆర్

కందుకూరు, (ప్రభ న్యూస్) : హైడ్రాతో పేద ప్రజల ఇండ్లను కూల్చి మూసి సుందరీకరణ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి 50వేల కోట్ల రూపాయల ఇవ్వడంలో భాగంగా మరో మోసానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

శనివారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రైతు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ కోసం ఒక్క ఎకరం భూమిని కూడా సేకరించలేదన్నారు.

ఫోర్త్ సిటీ పేరుతో ఫోర్త్ బ్రదర్స్ కు రియల్ ఎస్టేట్ భూములను పేదల భూములను గుంజుకోవాలని చూస్తున్నారన్నారు. గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోదండ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామన్నారు.

కానీ నేడు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లోనే ఫోర్త్ సిటీ ని నిర్మిస్తున్నారన్నారు. ఫార్మసిటీ భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతులను రుణమాఫీకి లేని డబ్బులు 1,50,000 కోట్ల రూపాయలను ఎలా సేకరిస్తార ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా,వడ్లకు ఐదు వందలు బొనాస్,రెండు లక్షల రుణమాఫీ నేటికీ జరగలేదన్నారు.

నేటికీ రైతాంగానికి రైతు భరోసా,కౌలు రైతులకు ఇస్తానన్న హామీలను అమలు చేయకుండా బోగస్ మాటలు చెప్పాడన్నారు. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు. రీజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కోసం మారుస్తున్నారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేయలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చ వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. సబితా ఇంద్రారెడ్డి ముగ్గురు కుమారుల పేరు మీద ఫామ్ హౌస్ లో ఉంటే కుల్లగొట్టాలన్నారు.

- Advertisement -

మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రెడ్డి మాట్లాడుతూ … ఫాక్స్ ఖాన్ కంపెనీ తెచ్చింది కెసిఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఆరోజు గుజరాత్ రాష్ట్రానికి పోకుండా కంపెనీ తెచ్చి పెడితే ప్రస్తుతం ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం కంపెనీ తెచ్చినట్లుగా డ్రామాలు మొదలు పెడుతున్నాడని అన్నారు.

ముఖ్యమంత్రికి మైకు దొరికితే చాలు కెసిఆర్ ,కేటీఆర్, హరీష్ రావులపై వ్యక్తిగత దూషణల కోసమే తప్ప అభివృద్ధిపై దృష్టి సాధించలేడని మండిపడ్డారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ఉంటే ప్రజల మధ్యన ఉండి పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ… రోడ్ల వెడల్పు పనులతో తమ్ముళ్ల కు రియల్ ఎస్టేట్ చక్కబెడుతూ అత్తగారు ఊర్లో ఉన్న భూములను కాపాడనందుకోసం కొత్త డ్రామా చేపడుతున్నాడని అన్నారు. ఇబ్రహీంపట్నంలో రైతులతో పెద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణి, నవీన్ రెడ్డి, షమీపూర్ రాజు, మహమ్మద్ అలీ, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, భువనగిరి పార్లమెంట్ బీ ఆర్ఎస్ ఇంచార్జ్ మల్లేష్, యువ నాయకుడు కార్తీక్ రెడ్డి, చిలుక మరి నరసింహ, చంద్రశేఖర్, విజేందర్ రెడ్డి,బీ ఆర్ఎస్ నాయకులు, అరవింద్ రెడ్డి,లక్ష్మీ నరసింహారెడ్డి, సురేందర్ రెడ్డి, చంద్రయ్య ముదిరాజ్, జయేందర్ ముదిరాజ్, రాజు నాయక్, కాకి దశరథ ముదిరాజ్, రేవంత్ రెడ్డి,కార్తీక్, చారి, మోహన్, వివిధ గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, బీ ఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement