Wednesday, January 8, 2025

Formula-E Race | అర పైసా అవినీతి కూడా జరగలేదు : కేటీఆర్

  • ఈ ప‌స లేని కేసు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే
  • న్యాయ పోరాటం చేస్తా
  • ఫార్ములా-ఈ కాదు ఫార్మ‌ర్ పై చ‌ర్చ‌కు రా..
  • సీఎం రేవంత్‌కి కేటీఆర్ సవాల్

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని త‌న‌ నివాసంలో కేటీఆర్ మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన కేటీఆర్… తనపై నమోదైన కేసు రాజకీయ ప్రేరేపితమని, ఇది పూర్తిగా అక్రమ కేసు అని ఆరోపించారు.

తాను అణా పైసా కూడా అవినీతి చేయలేదని… త‌న‌ తప్పేమీ లేదని. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరపాలని పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. అవినీతిపరులకు అంతా అవినీతిలాగే కనిపిస్తోందని విమర్శించారు. తన క్వాష్ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసిందని… అయితే తాను సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తానని కేటీఆర్ అన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ స‌వాల్ విసిరారు. రేవంత్ కి విధ్వంసం, మోసం, డైవర్షన్ అనే మూడే తెలిసిన పనులు అని అన్నారు. ఇదే కాంగ్రెస్ నైజం అని అన్నారు. ఫార్మూలా ఈ కారు రేసుపై కాదు… ఫార్మర్ సమస్యపై చర్చ జరగాలన్నారు. రేవంత్ మగాడివైతే జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ఓపెన్ చర్చ పెట్టు…. నేను వస్తా అని సవాల్ విసిరారు.

ఈనెల 16న ఈడీ విచారణకు హాజరుకావాలని కేటీఆర్ చెప్పారు. నాపై కేసు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు. నన్ను ఉరితీసినట్లు కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. అయితే సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఆరు హామీల అమలులో కాంగ్రెస్‌ నిర్లక్ష్యంపై.. అటెన్షన్‌ డైవర్షన్ పాలిటిక్స్ డ్రామాను ప్రజల ముందు బట్టబయలు చేయాలని బిఆర్‌ఎస్ నాయకులు, శ్రేణులు కెటిఆర్‌ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement