Friday, November 22, 2024

అందంతా నిజం కాదు.. రైల్వే ప్రైవేటీకరణపై సంచ‌లన వ్యాఖ్యలు…

ప్ర‌భ‌న్యూస్ : ఇండియన్‌ రైలేను ప్రైవేటీకరించనున్నారు అని వస్తున్న వార్తలు అవాస్తవమని రైలే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ అలాంటి నిర్ణయం ఉండదని వివరించారు. రైల్వే అనేది క్లిష్టమైన వ్యవస్థ అని పేర్కొన్నారు. రైల్వే ప్రయాణికులు, టీ స్టాల్‌ వ్యాపారుల నుంచి ఇటీవల నేరుగా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్నాం. ఇది సేవలను మెరుగుపర్చేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. రైల్వే ప్రైవేటీకరణ అంశం చర్చల్లోకి రావడం ఇది తొలిసారి కాదు. ఇది వరకు చాలా సార్లు దీనిపై చర్చ జరిగింది.

రైలేను ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అశ్వినీ వైష్ణవ్‌కు ముందు.. ఆ మంత్రి పదవిలో ఉన్న పీయూష్‌ గోయల్‌ కూడా ఇది వరకే ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. రైలేను ఎన్నటికీ ప్రైవేటుపరం చేయబోమని స్పష్టం చేశారు. రైల్వే భారత్‌ ఆస్తి. ఇది ప్రతీ భారతీయుడి ఆస్తి. ఎప్పటికీ దీన్ని ప్రైవేటుపరం చేయబోమని ఓ సందర్భంలో పీయూష్‌ గోయల్‌ చెప్పుకొచ్చారు. ప్రైవేటు పెట్టుబడులతో రైల్వే పనితీరును మెరుగుపరుస్తాం..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement