Friday, November 22, 2024

Nobel Prize 2023 – నార్వే ర‌చ‌యిత‌కు సాహిత్య విభాగంలో నోబెల్ పుర‌స్కారం

స్టాక్‌హోం: 2023 సంవత్సరానికి గానూ సాహిత్యం లో నోబెల్‌ బహుమతిని గురువారం ప్రకటించారు. నార్వేకు చెందిన రచయిత జాన్‌ ఫోసెను ఈ ఏడాది సాహిత్య నోబెల్‌ వరించింది. ఆయన తన వినూత్న నాటకాలు, గద్యాలు.. మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు గళంగా మారాయని స్వీడిష్‌ అకాడమీ ఈ సందర్భంగా వెల్లడించింది.

జాన్‌ ఒలావ్‌ ఫోసె 1959లో నార్వేలోని హేగ్‌సండ్‌ ప్రాంతంలో జన్మించారు. ఏడేళ్ల వయసులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. రచయిత మారేందుకు ఆ ఘటనే ఆయనకు స్ఫూర్తిగా నిలిచిందని చెబుతారు. సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆయన లిటరేచర్‌లో పట్టా పొందారు. 1983లో ఆయన ‘రెడ్‌, బ్లాక్‌’ పేరుతో తొలి నవల రాశారు. ఆ తర్వాత అనేక నాటకాలు, చిన్న కథలు, కవిత్వాలు, చిన్నారుల పుస్తకాలను రచించారు. ముఖ్యంగా తన గద్యాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఫోసె.. తన రచనల్లో ఎక్కువగా మానవ జీవన స్థితిగతులను ప్రస్తావించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement