ఉత్తర కొరియాలో ఎట్టిపరిస్థితుల్లో బ్లూకలర్ జీన్స్ ధరించకూడదని అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. మొన్నటి వరకు ఉత్తర కొరియాలో అసలు జీన్సే ధరించకూడదనే ఆంక్షలు ఉండేవి.. కొరియా సంస్కృతికి విరుద్ధంగా ప్రజలు ఎవరూ కూడా దుస్తులు ధరించకూడదు. పాశ్చాత్యపోకడలకు ఆ దేశం దూరంగా ఉంటుంది…బట్టల విషయంలో కిమ్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా వ్వవహరిస్తుంది. అయితే ఇప్పుడిప్పుడే ఆ దేశంలో జీన్స్ లకు అనుమతి ఇస్తున్నారు. అయితే నీలి రంగు జిన్స్ ధరించకూడదని కఠిన ఆంక్షలు విధించారట అక్కడ..ఎందుకంటే ఆ రంగు అమెరికాను సూచిస్తుందట. అమెరికా అంటే కొరియాకు అస్సలు పడదు. కిమ్ పాలన మొదలయ్యాక రెండు దేశాల మధ్య దూరం మరింతగా పెరిగింది.
ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియాలో మళ్లీ మొదలైన లాక్‌డౌన్