అమెరికాతో మళ్లీ చర్చలు జరిపే ప్రసక్తే లేదని, చర్చల కోసం ఆ దేశం కలలు కంటోందని ఉత్తర కొరియా లీడర్ కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ మండిపడ్డారు. ఆ దేశంతో చర్చలు అసంభవమన్నారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణి కార్యక్రమాలను వదులుకునేలా దౌత్యపర చర్యలు సహా అన్ని ప్రాక్టికల్ చర్యలకు సిద్ధమని ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. దీంతో గత వారం జరిగిన సమావేశంలో అమెరికాతో చర్చలు, పోరాటం.. రెండింటికీ సిద్ధంగా ఉండాలని కిమ్ జోంగ్ ఉన్ తన అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్.. అది ఎంత వరకు ముందుకెళ్తుందో వేచి చూడాలన్నారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలకు యో జోంగ్ కౌంటర్ ఇచ్చారు. అమెరికా తనకు తానే ఏవేవో ఊహించుకుంటోందన్నారు. అమెరికా అంచనాలన్నీ తప్పేనన్నారు. ఆ ఊహల్లోనే ఉంటే పెద్ద అసంతృప్తిలో మునిగిపోవాల్సి వస్తుందని సూచించారు.
అమెరికాతో మళ్లీ చర్చలు జరిపే ప్రసక్తే లేదు: కిమ్ సోదరి
- Tags
- america
- breaking news telugu
- important news
- Important News This Week
- Important News Today
- JO BAIDEN
- Kim Jong Un
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- north korea
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- viral news telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement