Saturday, November 23, 2024

ఆగని బిట్‌కాయిన్ల పతనం..

హాంగ్‌కాంగ్‌: బిట్‌కాయిన్‌ల విలువ గురువారం 16 నెలల కనిష్ఠ స్థాయికి చేరుకున్నది. టెక్‌ స్టాక్స్‌ పతనం కావడం, ఇప్పటివరకు స్థిరంగా ఉంటుందని అనుకుంటున్న టెర్రాయూఎస్‌డీ కాయిన్‌ విలువ కుప్పకూలిపోవడంతో బిట్‌కాయిన్‌ విలువ కూడా పడిపోయినట్లు భావిస్తున్నారు. ఈ రెండు క్రిఎ్టోకరెన్సీ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. క్రిఎ్టోకరెన్సీలో ప్రపంచంలోనే అత్యధిక విలువకలిగిన బిట్‌కాయిన్‌ విలువ 26,970 డాలర్లకు పడిపోయింది. 2020 డిసెంబర్‌ 28 నుంచి బిట్‌కాయిన్‌ విలువ ఇంతగా దిగజారడం ఇదే మొదటిసారి. గడిచిన ఎనిమిది సెషన్స్‌లో బిట్‌కాయిన్‌

విలువ మూడింటా ఒక వంతు కోల్పోయింది. అంటే దాదాపు 13,000 డాలర్లు కోల్పోయిందన్న మాట. 2021లో దీని విలువ అత్యధికంగా 69,000 వేల డాలర్లకు చేరుకొని రికార్డు సృష్టించింది. ఇటీవలి కాలంలో బిట్‌కాయిన్‌ విలువ పతనం కావడానికి టెక్‌ స్టాక్స్‌ పతనమే కారణమని అంటున్నారు. నాస్‌డాక్‌లో వీటి విలువ ఈ వారం 6.4 శాతం తగ్గింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement