Friday, November 22, 2024

29వరకు రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు.. 30న పరిశీలన

జులై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు బుధవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జులై 24తో ముగియనుంది. దీంతో, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించనున్న రాష్ట్రపతి అభ్యర్థికి పోటీగా, ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు మమతాబెనర్జీ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల నేతలు ఢిల్లిలో సమావేశమయ్యారు. విపక్ష నేతల ఉమ్మడి అభ్యర్థి సమావేశం నిర్వహించిన రోజునే రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభమైంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఈనెల 29 కాగా,30న పేపర్ల పరిశీలన జరగనుంది.

నామినేషన్ల ఉపసం హరణకు ఆఖరి గడువు జులై 2. రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ఎలక్టోరల్‌ కాలేజ్‌ ద్వారా జరుగుతుంది. ఈ ఎలక్టోరల్‌ కాలేజ్‌లో పార్లమెంటు ఎగువ, దిగువ సభల సభ్యు లు, రాష్రాల శాసనసభ సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రజా ప్రతినిధులు, దేశ రాజధాని ఢిల్లి అసెంబ్లి ఎమ్మెల్యేలు సభ్యులు. ఈ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఎలక్టోరల్‌ కాలేజ్‌ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. శాసనమండలి సభ్యులకు మాత్రం రాష్ట్ర పతి ఎన్నికల్లో ఓటేసే అర్హత లేదు. రాష్ట్రపతి ఎన్నికలు జులై 18న జరగనుండగా, అవసరమైతే, 21న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఢిల్లిలో జరుగుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement