Tuesday, November 19, 2024

Nominated Posts – బి ఆర్ ఎస్ ఓట‌మితో ప‌లు కార్పొరేష‌న్ చైర్మ‌న్లు, స‌ల‌హాదారులు రాజీనామా

హైదరాబాద్: అదికార బిఆర్ఎస్ పార్టీ ఓట‌మి చెంద‌డంతో ఆ ప్ర‌భుత్వంలో వివిద కార్పొరేష‌న్ల‌కు, నామినేటెడ్ పోస్టుల‌కు, స‌ల‌హాదారులుగా నియ‌మితులైన నేత‌లు రాజీనామా బాట ప‌ట్టారు.. త‌మ త‌మ రాజీనామా లేఖ‌ల‌ను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి పంపారు..

కాగా, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు సోమవారంనాడు తన పదవికి రాజీనామా సమర్పించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామాను సమర్పిస్తున్నట్టుగా ప్రభాకర్ రావు ప్రకటించారు. సాంస్కృతిక సలహాదారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమణాచారి త‌న రాజీనామా లేఖ‌ను సిఎస్ కు పంపారు..

రాజీనామా చేసిన వారి వివ‌రాలు

  1. సోమ భరత్ కుమార్ .. చైర్మన్, రాష్ట్ర డెయిరీ డేవలప్మెంట్ కార్పొరేషన్
  2. జూలూరి గౌరీ శంకర్ … చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ
  3. పల్లె రవి కుమార్ గౌడ్ .. చైర్మన్, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్
  4. డాక్టర్ ఆంజనేయ గౌడ్ …చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ
  5. మేడె రాజీవ్ సాగర్ ..చైర్మన్, TS Foods Corporation
  6. డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఛైర్మ‌న్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ.
  7. గూడూరు ప్రవీణ్… చైర్మన్, టైక్స్టైల్స్ కార్పొరేషన్.
  8. గజ్జెల నగేష్ … చైర్మన్, బేవరేజెస్ కార్పొరేషన్.
  9. అనిల్ కూర్మాచలం ..చైర్మన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్.
    10.రామచంద్ర నాయక్ … చైర్మన్, ట్రైకార్.
  10. వలియా నాయక్ .. చైర్మన్, గిరిజన ఆర్థిక సహకార సంస్థ.
  11. వై సతీష్ రెడ్డి .. చైర్మన్, Telangana State Renewable Energy Development Corporation ||
  12. డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ – చైర్మన్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ
  13. రవీందర్ సింగ్ .. చైర్మన్, పౌర సరఫరాల సంస్థ.
  14. జగన్మోహన్ రావు .. చైర్మన్, రాష్ట్ర టెక్నాలజికల్ సర్వీసెస్.
Advertisement

తాజా వార్తలు

Advertisement