Monday, October 7, 2024

Nobel Prize: వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి…

ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతుల ప్రకటన సోమవారం నుండి మొదలైంది. ఇవాళ వైద్యశాస్త్రంలో చేసిన అసాధారణ పరిశోధనకు గాను ఇద్దరు అమెరికన్ డాక్టర్లకు నోబెల్ బహుమతి ప్రకటించారు. విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్కూన్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.

జన్యు కార్యకలాపాలను నియంత్రించే ప్రాథమిక సూత్రమైన మైక్రో ఆర్ఎన్ఏ.. పోస్ట్ ట్రాన్స్ స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్ లో దాని పాత్రపై చేసిన పరిశోధనల్లో వీరిరువురికి నోబెల్ పురస్కారం అందిస్తున్నట్టు స్వీడన్ లోని నోబెల్ బృందం సోమవారం ప్రకటించింది. కాగా ఇప్పటివరకు వైద్యశాస్త్రంలో 227 మంది నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్దంతి రోజైన డిసెంబర్ 10న జరిగే వేడుకల్లో గ్రహీతలకు బహుమతితో పాటు, లక్ష డాలర్లను అందజేస్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement