Wednesday, November 20, 2024

Nobel Peace Prize – జపాన్ సంస్థ‌కు నోబెల్ శాంతి బ‌హుమ‌తి

ఈ ఏడాది నోబెల్ శాంతి బ‌హుమ‌తిని జపాన్ సంస్థ హాన్ హిడాంకియోకు ల‌భించింది.. ఈ మేర‌కు నోబెల్ క‌మిటీ నేడు ప్ర‌క‌టించింది.. అణు ర‌హిత స‌మాజం కోసం ఆ సంస్థ సేవ‌కు గుర్తింపుగా ఈ ఏడాది శాంతి బ‌హుమ‌తిని అంద‌జేస్తున్న‌ట్లు నోబెల్ నిర్వాహ‌కులు తెలిపారు..
హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు దాడి జ‌రిగిన అనంత‌రం జ‌పాన్ లో ప్ర‌జ‌లు అనుభ‌వించిన క‌ష్టాల‌ను,న‌ష్టాల‌ను ప్ర‌పంచానికి తెలీయ‌జేసేందుకు ఈ సంస్థ 1956లో ఏర్పాటు చేశారు.. అప్ప‌టి నుంచి అణు యుద్దం వ‌స్తే జ‌రిగే ప‌రిణామాల గురించి ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త్రుతంగా ప్ర‌చారం చేస్తున్న‌ది.. అణుర‌హిత స‌మాజం కోసం ఈ సంస్థ నిరంత‌రం కృషి చేస్తున్న‌ది..అణ్వాయుధ నిరాధిక‌ర‌ణ కోసం ఈ సంస్థ నిరంత‌రం ప్ర‌జ‌ల‌లో చైత‌న్య కార్య‌క్ర‌మాన‌లు నిర్వ‌హిస్త‌న్న‌ది.. దీంతో హాన్ హిడాంకియో సంస్థ చేస్తున్న సేవ‌ల‌కు గుర్తింపుగానే నోబెల్ శాంతి పుర‌స్కారం ద‌క్కించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement