స్టాక్ హోం – ఇరాన్లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా, మానవ హక్కులు, స్వేచ్ఛను పెంపొందించడం కోసం పోరాడిన ఇరాన్ మహిళ నెర్గెస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి లభించింది.. ఈ మేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటించింది. మానవ హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో ఆమె 13సార్లు అరెస్ట్ అయ్యారు. సుమారు 31 ఏళ్లపాటు జైలు జీవితాన్ని గడిపారు. అంతే కాకుండా 154 కొరడా దెబ్బలు కూడా తిన్నట్లు నోబెల్ ప్రైజ్ వెబ్సైట్లో పేర్కొన్నారు. ఈ అవార్డు గురించి శుక్రవారం నోబెల్ ప్రైజ్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement