అమరావతి, ప్రభన్యూస్ బ్యూరో: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఇదే తరహాలో మను షులతో పాటు పశువులకు మెరుగైన వైద్య సేవలను అందు బాటులో ఉంచాలని జగన్ సర్కార్ సంకల్పించింది. అందు కోసం పెద్దఎత్తున నిధులను వెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లో పశు ప్రాణాలకు భద్రత కల్పించేలా వైఎస్సార్ సంచార పశు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే క్షేత్ర స్థాయిలో కొంతమంది సిబ్బంది ఆ దిశగా పల్లెల్లో పశువులకు వైద్య సేవలు అందించలేకపోతున్నా రు. టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసినా సకాలంలో ఆయా ప్రాంతాలకు చేరుకోలేక పోతు న్నారు. కొన్ని సందర్భాల్లో అయితే ఫోన్ చేసినా పలికే పరిస్థితి కనిపించడం లేదు. అసలు పాడి రైతులకు వెటన్నరి అంబు లెన్స్‌లు ఉన్న సంగతి కూడా చాలా మందికి ఇప్పటివరకు తెలియదంటే వైఎస్సార్ సంచార పశువైద్య సేవలపై సంబ ంధిత అధికారులు ఏ మేరకు ప్రచారం చేపట్టారో, రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టారో స్పష్టంగా అర్ధమ వుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి అత్యంత ఆధునిక హంగులతో రూపొందించిన రెండు వెటన్నరి అంబులెన్స్‌లు అంబుబాటులో ఉన్న సంగతి చాలా మంది పాడి రైతులకు తెలియకపోవడంతో కొన్ని సందర్భాల్లో పశు వులను సమీప పశు వైద్యశాలకు తీసుకెళ్లాల్సి వస్తోంది. అందుకోసం అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో పశువుల ప్రాణాలు కూడా పోతున్నాయి. అయితే అటువంటి పరిస్థితులు ఉండకూడదనే ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి లోటు బడ్జెట్‌లోనూ కోట్లాది రూపాయలు వెచ్చించి రెండు విడతల్లో ప్రతి నియోజ కవర్గానికి రెండు అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. అయితే సంబంధిత శాఖ జిల్లా అధికారులు, ఆయా ప్రాంతాల్లో ఉండే వెటన్నరి క్షేత్ర స్థాయి సిబ్బంది సంచార పశు వైద్యసేవల పట్ల ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సేవలను అందించలే కపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రూ.240 కోట్లతో..340 వెటన్నరి అంబులెన్స్‌లు
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక అన్ని రంగాల్లో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలను అందించాలని ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ నేపధ్యంలోనే పాడి రైతు సమస్యలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో పశు మరణాలు పునరావృతం కాకుడదన్న ఉద్దేశ్యంతో పశు సంరక్షణ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ.240.69 కోట్ల వ్యయంతో 340 వెటన్నరి అంబులెన్స్‌లను కొనుగోలు చేశారు. తొలి విడతలో రూ.129.7 కోట్ల వ్యయంతో 175 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. తాజాగా గత నెలలో రెండవ విడతలో రూ.112.62 కోట్ల వ్యయంతో మరో 165 వెటన్నరి అంబులెన్స్‌లను కొనుగోలు చేసి ప్రతి నియోజ కవర్గానికి రెండు అంబులెన్స్‌లు పశువులకు వైద్య సేవలం దించేలా ఏర్పాట్లు చేశారు. అందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించారు.
పల్లెల్లో కనిపించని..సంచార పశు వైద్యసేవలు
గ్రామీణ ప్రాంతాల్లో చూద్దామన్న కొన్ని గ్రామాల్లో సంచార పశు వైద్య సేవలు కనిపించడం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న పశువుల వద్దకే వెళ్లి తక్షణమే వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశ్యంతో సంచార వైద్య సేవలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అందు కోసం ప్రతి అంబులెన్స్‌లో ఒక పశువైద్యుడు, వెటన్నరి డిప్లొమా చేసిన ఒక సహాయకుడు, అటెండర్‌ను నియమిం చింది. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో పశువులకు వైద్య సేవలు అందించడంతో పాటు 20 రకాల జబ్బులకు సంబం ధించి పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా అంబులెన్స్‌లోనే కొన్ని పరికరాలను కూడా ఏర్పాటు చేసింది. అలాగే కొన్ని రకాల మందులను కూడా వాహనంలో ఉండేలా నిధులను కూడా కేటాయించింది. ఇన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నా పల్లెల్లో మాత్రం అక్కడక్కడ తప్పితే పూర్తి స్థాయిలో సంచార వైద్య సేవలు అందుబాటులోకి రాలేదన్న ఆవేదన పలువురు పాడి రైతుల్లో వ్యక్తమవుతోంది.
1962 టోల్‌ఫ్రీ నెంబర్‌పై అవగాహన శూన్యం
రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో మూగజీవాలు అనారోగ్యానికి గురైనప్పుడు తక్షణమే పాడి రైతు పశు వైద్యు లకు సమాచారం అందించేలా 1962 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. పై నెంబర్‌కు ఫోన్ చేసి రైతు పేరు, గ్రామం, మండలం పేరు చెప్పి సమస్యను వివరిస్తే వెంటనే సంచార పశు వైద్య సేవలందించాలి. అందుకోసం తక్షణమే సమా చారం అందేలా రైతు భరోసా కేంద్రంలో ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా సమాచారం అందగానే వెంటనే ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న అంబులెన్స్ ఫోన్ చేసిన గ్రామానికి చేరుకుని సంబంధిత పశువులకు అవసరం అయిన వైద్యాన్ని అందించాలి. ఏవైనా పరీక్షలు చేయాల్సి వచ్చినా అంబులెన్స్‌లోనే అందుకు సంబంధించిన పరికరాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య సమస్య పెద్దదైతే ప్రాథమిక చికిత్స అందించి సమీపంలోని పశు వైద్య శాలకు మూగజీవాలను పంపే ఏర్పాట్లు చేయాలి. అయితే అన్నిరకాల పశు వైద్య సేవలు అంబులెన్స్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ కనీసం రైతుల్లో 50 శాతం మందికి కూడా టోల్‌ఫ్రీ నెంబర్‌పై అవగాహన లేకపోవడంతో చాలా మంది ఆ సేవలను ఉపయోగించుకోలేకపోతున్నారు. పాడి రైతులకు అవగాహన కల్పించేలా సంబంధిత పశు వైద్య సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టకపోవడం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది.